Population | అక్షరాల 144 కోట్లు.. ఇదీ ప్రస్తుతం భారత దేశ జనాభా..
ప్రస్తుతం భారత దేశ జనాభా ఎంతో తెలుసా? అక్షరాల 144 కోట్లు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో 0 నుండి 14 ఏండ్ల వయస్సులో ఉన్నవారు 24 శాతం మంది ఉన్నట్టు నివేదిక పేర్కొన్నది.
- యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నివేదిక
- ప్రసవ సమయంలో తగ్గిన శిశు మరణాలు
Population | న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ప్రస్తుతం భారత దేశ జనాభా ఎంతో తెలుసా? అక్షరాల 144 కోట్లు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో 0 నుండి 14 ఏండ్ల వయస్సులో ఉన్నవారు 24 శాతం మంది ఉన్నట్టు నివేదిక పేర్కొన్నది. 2021లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు. ప్రసవ సమయంలో శిశు మరణాలు సంఖ్య బాగా తగ్గినట్టు నివేదిక వెల్లడించింది. దేశ జనాభాలో 10 నుండి 19 ఏండ్ల మధ్యనున్న వారు 17 శాతం మంది ఉండగా.. 10 నుండి 24 ఏండ్ల మధ్య ఉన్న వారు 68 శాతం ఉన్నారు.
ఇక సీనియర్ సిటిజన్లు 7 శాతం ఉన్నారు. పురుషుల ఆయుర్దాయం 71 సంవత్సరాలు కాగా..స్త్రీల ఆయుర్దాయం 74 సంవత్సరాలుగా తేలిందని యూఎన్ఎఫ్పీఏ తెలిపింది. 2006-2023 మధ్య కాలంలో భారత్లో బాల్య వివాహాలు 23 శాతమని నివేదిక తేల్చింది. పీఎల్ఓఎన్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 640 జిల్లాల్లో ప్రసవానంతర మరణాల నిష్పత్తి లక్ష జననాలకు 70 కంటే తక్కువగా నమోదైంది. 114 జిల్లాల్లో మాత్రం ఈ నిష్పత్తి 210 కంటే ఎక్కువగా ఉన్నది. దాదాపు సగం మంది దళిత మహిళలకు ప్రసవానంతరం సంరక్షణ అందటం లేదని చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

