CJI Surya Kant: చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు.. లండన్ కాలేజీలో ఘటన
CJI Surya Kant: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు లండన్‌లో చేదు అనుభవం ఎదురైంది. బిర్క్‌బెక్ కాలేజీలో ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. జూన్ 4వ తేదీన ఈ ఘటన జరిగింది. అయితే భారతీయ హై కమిషన్ ఈ ఘటనను ఖండించింది.
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్(CJI Surya Kant)కు లండన్‌లో చేదు అనుభవం ఎదురైంది. బిర్క్‌బెక్ కాలేజీలో ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. జూన్ 4వ తేదీన ఈ ఘటన జరిగింది. అయితే భారతీయ హై కమిషన్ ఈ ఘటనను ఖండించింది. లండన్ కాలేజీలో ప్రసంగం చేస్తున్న సమయంలో జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ లెక్చర్‌కు హాజరైన కొందరు చీఫ్ జస్టిస్‌ను ప్రశ్నలతో నిలదీశారు. భారత్‌లో భావస్వేచ్ఛ లేదని ఆరోపించారు. నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడాన్ని ప్రశ్నిస్తూ కామెంట్లు చేశారు. అయితే ఆ ప్రశ్నోత్తరాల ఈవెంట్‌ను నిర్వాహకులు తక్షణమే రద్దు చేశారు. ఇది టాపిక్‌లో లేని అంశమని పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నేషనల్ లా అన్న అంశంపై ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రేక్షకుల ప్రవర్తన అసభ్యకరంగా ఉన్నట్లు భారతీయ హై కమిషన్ తన స్టేట్మెంట్లో పేర్కొన్నది. మర్యాదపూర్వకంగా జరగాల్సిన ఈవెంట్లో ప్రేక్షకుల ప్రవర్తన ఆమోదయోగ్యంగా ఉందని, అసమర్థనీయంగా ఉన్నట్లు తన ప్రకటనలో హై కమిషన్ చెప్పింది. భిన్నాభిప్రాయాలను చాలా హుందాగా, మర్యాదపూర్వకంగా వ్యక్తం చేయాల్సి ఉంటుందని హై కమిషన్ అభిప్రాయపడింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగాన్ని అడ్డుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— India in the UK (@HCI_London) June 5, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

