60 Para Field: తుర్కియేలో 4 వేల మందికి చికిత్స అందించాం: ఇండియన్ ఆర్మీ మెడికల్ టీమ్
60 Para Field : 60 Para Field హాస్పిటల్ ద్వారా 4 వేల మందికి చికిత్స అందించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఆపరేషన్ దోస్తులో భాగంగా తుర్కియేలో ఇండియన్ ఆర్మీ మెడికల్ టీమ్ సహాయక చర్యల్లో పాల్గొన్నది.
న్యూఢిల్లీ: తుర్కియే భూకంప (Turkey Earthquake)బాధితుల్ని రక్షించేందుకు ఆపరేషన్ దోస్త్(Operation Dost) పేరుతో భారత్ సహాయక చర్యల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఆపరేషన్ దోస్త్‌కు వెళ్లిన ఇండియన్ ఆర్మీ మెడికల్ టీమ్ స్వదేశానికి తిరిగి వచ్చింది. ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ఇవాళ మెడికల్ బృందంతో విమానం ల్యాండ్ అయ్యింది.
భూకంప కేంద్రమైన హటయ్లోని ఇకేంద్రన్లో 30 పడకల ఫీల్డ్ హాస్పిటల్‌ను భారత బృందం ఏర్పాటు చేసింది. సుమారు నాలుగు వేల మంది పేషెంట్లకు అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. 60 పారా ఫీల్డ్(60 Para Field) మెడికల్ బృందంలో మొత్తం 99 మంది ఉన్నారు.
60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ ఆదర్శ శర్మ మాట్లాడుతూ.. తుర్కియేకు హుటాహుటిన దళాన్ని పంపించినందుకు ప్రభుత్వానికి థ్యాంక్స్ తెలిపారు. కేవలం కొన్ని గంటల్లోనే ఫీల్డ్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 4వేల మంది పేషెంట్లకు చికిత్స అందించామని, దాంట్లో మేజర్, మైనర్ సర్జరీ కేసులున్నాయన్నారు. సరైన సమయంలో సరైన చికిత్సను అందించామని, ఆ లక్ష్యాన్ని తాము అందుకున్నట్లు కల్నల్ ఆదర్శ్ శర్మ తెలిపారు.
ఫీల్డ్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసిన రెండు గంటల్లోనే చికిత్స ప్రారంభించినట్లు మెడికల్ ఆఫీసర్ మేజర్ బీనా తివారి తెలిపారు. తమకు సహకరించిన తుర్కియే ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు ఆమె థ్యాంక్స్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

