India’s Population | భారతదేశ జనాభా 144కోట్లు..! యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నివేదిక..!
India's population | భారత దేశ జనాభా 144 కోట్లకు చేరిందని అంచనా. ఇందులో 24శాతం మంది 0-14 సంవత్సరాల వయుసున్న ఉన్నారు. ఈ విషయాన్ని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) నివేదిక పేర్కొంది.
India’s population | భారత దేశ జనాభా 144 కోట్లకు చేరిందని అంచనా. ఇందులో 24శాతం మంది 0-14 సంవత్సరాల వయుసున్న ఉన్నారు. ఈ విషయాన్ని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) నివేదిక పేర్కొంది. అయితే, 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 121 కోట్లు. అయితే, ప్రసవ సమయంలో శిశు మరణాలు తగ్గుముఖం పట్టాయని నివేదిక వెల్లడించింది. భారతదేశ జనాభాలో 24 శాతం మంది 0-14 సంవత్సరాల మధ్య వయస్కులు కాగా.. 17శాతం మంది 10-19 సంవత్సరాల మధ్య వయస్కులున్నారు. జనాభాలో 68 శాతం మంది 10-24 ఏళ్ల మధ్య వయస్కులు కాగా, 7 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.
పురుషుల ఆయురార్దం 71 సంవత్సరాలు కాగా.. మహిళల ఆయుర్దాయం 74 సంవత్సరాలు. 2006 నుంచి 2023 మధ్య భారత్లో బాల్య వివాహాల శాతం 23శాతంగా ఉందని పేర్కొంది. ఇక దేశంలో డెలివరీ సమయంలో మరణాలు తగ్గుముఖం పట్టాయి. పీఎల్ఓఎస్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ నివేదికను ఉదహరిస్తూ.. 640 జిల్లాల్లో ప్రసవానంతర మరణాల నిష్పత్తి లక్ష జననాల్లో 70 కంటే తక్కువగా ఉంది. 114 జిల్లాల్లో ఈ నిష్పత్తి 210 కంటే ఎక్కువగా ఉంది. వికలాంగులు, శరణార్థులు, జాతి మైనారిటీలు, క్వీర్ కమ్యూనిటీలు, హెచ్ఐవీతో బాధితులతో పాటు అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలు, బాలికలు అత్యధిక లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్య ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని వేదిక పేర్కొంది.
చదువుకునే, పని ప్రదేశాల్లో కుల వివక్షను ఎదుర్కొంటున్న మహిళలకు చట్టపరమైన రక్షణ కల్పించాలని భారతదేశంలోని దళిత ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నట్లుగా నివేదిక పేర్కొంది. కొన్ని కుటుంబాలు పూర్తిగా నిరుపేదలుగా మిగిలిపోతాయని.. తమ కుటుంబాలను పోషించలేరని.. వారి పిల్లలను పేదరికం నుంచి బయటకు తీసుకురాలేరు. ఇది పేలవమైన లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రోత్సహించే చట్రానికి దోహదం చేస్తుంది. దాదాపు సగం మంది దళిత మహిళలకు ప్రసవానంతర సంరక్షణ అందడం లేదు. ప్రతిరోజూ 800 మందికిపైగా మహిళలు ప్రసవ సమయంలో మరణిస్తున్నారని నివేదిక తెలిపింది. నాలుగో వంతు మంది మహిళలు తమ భాగస్వామితో శృంగారాన్ని నిరాకరించలేకపోతున్నారు. ప్రతి పది మంది మహిళల్లో ఒకరు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్లుగా నివేదిక పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

