టీ20 ప్రపంచకప్: భారత్-పాక్ మ్యాచ్ రాజధర్మానికి వ్యతిరేకం: బాబా రామ్‌దేవ్

నాగపూర్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం దుబాయ్‌లో జరుగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జాతీయ ప్రయోజనాలు, రాజధర్మానికి విరుద్ధమని యోగా గురువు బాబా రామ్‌దేవ్ అన్నారు. శనివారం మహారాష్ట్రలోని నాగపూర్ ఎయిర్పోర్ట్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. ‘పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితిలో క్రికెట్ మ్యాచ్ ఆడటం రాజధర్మానికి వ్యతిరేకం. ఇది దేశ ప్రయోజనాల కోసం కాదు. క్రికెట్ ఆట, టెర్రర్ గేమ్‌ని ఒకేసారి ఆడలేం’ అని అన్నారు.
బాలీవుడ్లో మాదకద్రవ్యాలపైనా బాబా రామ్‌దేవ్ స్పందించారు. దేశంలోని యువతరానికి ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. ‘మాదకద్రవ్య వ్యసనం గ్లామరైజ్ చేసే విధానం. రోల్ మోడల్స్, ఆదర్శాలు లేదా చిహ్నాలుగా పరిగణించే ప్రముఖులు ఈ కుట్రలో పాలుపంచుకోవడం ప్రజలకు తప్పుడు స్ఫూర్తి. ఈ గందరగోళం నుంచి చిత్ర పరిశ్రమను క్లియర్ చేయాలి’ అని వ్యాఖ్యానించారు.
దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలపైనా బాబా రామ్‌దేవ్ మాట్లాడారు. నల్లధనాన్ని దేశానికి రప్పించడం వల్ల ఇంధన ధరలు తగ్గుతాయని చెప్పారు. ముడి చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్ ధర ఉండాలన్నారు. తక్కువ పన్ను విధించాలని ప్రభుత్వానికి సూచించారు.
జాతీయ ప్రయోజనాల కోసం సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగించాల్సి ఉంటుందని రామ్ దేవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో వివిధ ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. ఈ కారణాల వల్ల ప్రభుత్వం పన్నులను తగ్గించలేకపోతుందని చెప్పారు. అయితే ఈ కల ఏదో ఒక రోజు నెరవేరుతుందని ఆయన అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

