Independence Day | భారత్, బంగ్లా సరిహద్దులో.. తొలిసారి స్వీట్లు పంచుకున్న మహిళా జవాన్లు
Independence Day | దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో అరుదైన సంఘటన జరిగింది. ఇరు దేశాలకు చెందిన మహిళా జవాన్లు తొలిసారి సాంప్రదాయ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకోవడంతోపాటు స్వీట్లు పంచుకున్నారు.
కోల్‌కతా: దేశ స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో అరుదైన సంఘటన జరిగింది. ఇరు దేశాలకు చెందిన మహిళా జవాన్లు తొలిసారి సాంప్రదాయ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకోవడంతోపాటు స్వీట్లు పంచుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం గెడే సరిహద్దులోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) పోస్ట్ సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది. 32వ బెటాలియన్‌కు చెందిన ఆరుగురు బీఎస్ఎఫ్ మహిళా జవాన్లు, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)కు చెందిన మహిళా సైనికులు కలుసుకున్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడంతోపాటు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.
కాగా, భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు దళాల మధ్య పరస్పర గౌరవం, స్నేహభావానికి ఈ సాంప్రదాయం ప్రతీక అని 32వ బెటాలియన్ బీఎస్ఎఫ్ కమాండెంట్ సుజీత్ కుమార్ తెలిపారు. అయితే ఇరు దేశాల సరిహద్దు దళాలకు చెందిన మహిళా సైనికులు ఈ వేడుకలో పాల్గొనడం తొలిసారి అని వెల్లడించారు.
మరోవైపు బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఆ దేశంలో ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో 4,000 కిలోమీటర్ల సరిహద్దులో హై అలర్ట్ కొనసాగుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

