నేనో అమరవీరుడి కుమారున్ని.. అవమానాన్ని సహించను: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: జలియన్‌వాలా బాగ్ స్మారక పునర్ నిర్మాణం వివాదాస్పదమవుతుంది. స్మారకం వద్ద లైట్ షో నిర్వహించడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) స్పందించారు. దేశ స్వాతంత్య్ర కోసం పోరాటం చేయనివాళ్లు.. దీన్ని అర్థం చేసుకోలేరిన ఆయన ఇంగ్లీష్‌లో ఓ ట్వీట్ చేశారు. హిందూలోనూ ఓ ట్వీట్ చేసిన రాహుల్.. జలియన్‌వాలా బాగ్ అమరవీరులను అవమానించారని, అమరవీరులంటే తెలియనవాళ్లు మాత్రమే అలా చేస్తారని, తాను ఓ అమరుడి కుమారున్ని అని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని అన్నారు. లైట్ షోను రాహుల్ క్రూరత్వంతో పోల్చారు.
102 ఏళ్ల క్రితం జలియన్‌వాలా బాగ్‌లో శాంతియుతంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనపై బ్రిటీష్ జనరల్ డయ్యర్ కాల్పులకు ఆదేశించారు. ఆ కాల్పుల్లో వెయ్యి మందికిపైగా మరణించారు. ఆ ఘటన జరిగిన ప్రదేశం వద్ద స్మారకం నిర్మించారు. ఆ స్మారకం వద్ద తాజాగా లైట్ షోను ఏర్పాటు చేయడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొననివారు మాత్రమే ఇలాంటి స్కామ్ చేస్తారని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. స్మారకం వద్ద డిస్కో లైట్లు పెట్టడం మర్యాదపూర్వకం కాదు అని, అది జలియన్‌వాలా బాగ్ తీవ్రతను ఓ వినోదంగా మారుస్తుందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ తెలిపారు.
जलियाँवाला बाग़ के शहीदों का ऐसा अपमान वही कर सकता है जो शहादत का मतलब नहीं जानता।
— Rahul Gandhi (@RahulGandhi) August 31, 2021
मैं एक शहीद का बेटा हूँ- शहीदों का अपमान किसी क़ीमत पर सहन नहीं करूँगा।
हम इस अभद्र क्रूरता के ख़िलाफ़ हैं। pic.twitter.com/3tWgsqc7Lx
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jamia Millia Islamia | ఎన్నికల కోసం జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు నిరసన.. భద్రతా సిబ్బందితో ఘర్షణ
రుద్ర వాణి గాయత్రికి ఎంజీయూ డాక్టరేట్
Earthquake | వనువాటు తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

