India Vs Bharat | ఇండియా పేరు మార్పుపై ఐక్యరాజ్య సమితి కీలక వ్యాఖ్యలు.. అలా చేస్తే రికార్డుల్లో మార్చేస్తాం!
India Vs Bharat | భారత దేశం అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేస్తే తమ రికార్డులలో ‘ఇండియా’ పేరును ‘భారత్’గా (India Vs Bharat) మార్చేందుకు అంగీకరిస్తామని యునైటెడ్ నేషన్స్ ( ఐక్యరాజ్యసమితి) తెలిపింది.
న్యూఢిల్లీ: భారత దేశం అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేస్తే తమ రికార్డులలో ‘ఇండియా’ పేరును ‘భారత్’గా (India Vs Bharat) మార్చేందుకు అంగీకరిస్తామని యునైటెడ్ నేషన్స్ ( ఐక్యరాజ్యసమితి) తెలిపింది. భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రధాన ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పేరు మార్పు కోసం భారతదేశం అన్ని లాంఛనాలు పూర్తి చేసి తమకు తెలియజేస్తే యూఎన్ రికార్డులలో ఆ మేరకు మార్పులు చేస్తామని తెలిపారు.
కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ20 అతిథులను విందుకు ఆహ్వానించిన పత్రాల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ గా పేర్కొన్నారు. అలాగే మోదీని ‘భారత్ ప్రధాని’గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే ప్రతిపక్షాలతోపాటు పలు రంగాలకు చెందిన నిఫుణులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

