DK Shivakumar | నా బిడ్డను కలిసేందుకు ఎస్ఎం కృష్ణ ఇంటికి వెళ్తున్నా : డీకే శివకుమార్
DK Shivakumar | కర్ణాటక (Karnataka) లో సీఎం పదవిపై గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదానికి ఇవాళ తాత్కాలికంగా తెరపడింది. అధిష్ఠానం జోక్యంతో ఇవాళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు.
DK Shivakumar : కర్ణాటక (Karnataka) లో సీఎం పదవిపై గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదానికి ఇవాళ తాత్కాలికంగా తెరపడింది. అధిష్ఠానం జోక్యంతో ఇవాళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని, ఇద్దరం కలిసికట్టుగా పనిచేస్తామని సమావేశం అనంతరం వారు విడివిడిగా ప్రకటించారు.
ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం తన నివాసం నుంచి బయలుదేరిన డీకే శివకుమార్ను మీడియా పలుకరించగా.. ఇవాళ తన కుమార్తెను కలిసేందుకు కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ ఇంటికి వెళ్తున్నానని చెప్పారు. ఇవాళ ఆయన ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఉన్నదని తెలిపారు. డీకే శివకుమార్ తన కుమార్తె ఐశ్వర్యను ఎస్ఎం కృష్ణ మనవడు, అమర్త్య హెడ్గేకు ఇచ్చారు.
అమర్త్య హెడ్గే కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుమారుడు. ఎస్ఎం కృష్ణ కుమారుడైన వీజీ సిద్ధార్థ అప్పుల భారం పెరగడంతో నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్గా, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ 2024 డిసెంబర్ 10న కన్నుమూశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

