Wife Sells Husband Kidney, Elopes With Lover | భర్త కిడ్నీ అమ్మిన భార్య.. ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో పరార్
Wife Sells Husband Kidney, Elopes With Lover | భర్తను బురిడీ కొట్టించిన భార్య అతడి కిడ్నీని అమ్మింది. ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో కలిసి ఆమె పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త షాక్ అయ్యాడు.
కోల్‌కతా: భర్తను బురిడీ కొట్టించిన భార్య అతడి కిడ్నీని అమ్మింది. ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో కలిసి ఆమె పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త షాక్ అయ్యాడు. (Wife Sells Husband Kidney, Elopes With Lover ) పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సంక్రైల్ ప్రాంతానికి చెందిన మహిళ ఇంటి ఆర్థిక ఇబ్బందులు, కుమార్తె భవిష్యత్తు గురించి ఆందోళన చెందింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ఒక ప్లాన్ వేసింది. ఆరోగ్యం కోసం వైద్య చికిత్స అవసరమని భర్తను నమ్మించింది. రహస్యంగా అతడికి సర్జరీ చేయించింది. భర్తను బురిడీ కొట్టించి అతడి కిడ్నీని పది లక్షలకు అమ్మింది. ఆ డబ్బును బ్యాంకులో జమ చేస్తానని భర్తకు చెప్పింది. రాత్రికి రాత్రే ఆ డబ్బు తీసుకుని కుమార్తెతో పాటు ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది.
కాగా, భార్య, కుమార్తెతో పాటు డబ్బు కనిపించకపోవడంతో భర్త షాక్ అయ్యాడు. ఆమె కోసం వెతకగా బరాక్‌పూర్ ప్రాంతంలో ప్రియుడైన పెయింటర్‌తో కలిసి ఆమె నివసిస్తున్నట్లు తెలుసుకున్నాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆమెను నిలదీశాడు. అయితే ఇంటికి తిరిగి రానని భార్య తెగేసి చెప్పింది. అలాగే విడాకుల పత్రాలు పంపుతానని బెదిరించింది. దీంతో భార్య తనను మోసగించినట్లు తెలుసుకున్న భర్త ఆమెపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

