అమర్నాథ్ యాత్రకు విశేష స్పందన
శ్రీనగర్ : అమర్నాథ్ యాత్రకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. యాత్ర సోమవారం నాటికి ఐదో రోజుకు చేరగా.. ఒకే రోజు 19వేల మంది భక్తులు బాబా బర్ఫానీని దర్శించుకున్నారు. యాత్ర కోసం జమ్మూకశ్మీర్ ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. యాత్ర సాగుతున్న కొద్ది యాత్రికుల సంఖ్య పెరుగుతోందని అమర్నాథ్ క్షేత్ర ట్రస్ట్ బోర్డ్ తెలిపింది. దేశం నలుమూలల నుంచి భక్తులు జమ్మూకు తరలివస్తున్నారని పేర్కొంది.
ఈ క్రమంలో యాత్రికుల కోసం అమర్నాథ్ దేవస్థానం బోర్డు ప్యాసింజర్ ఫీడ్‌బ్యాక్ సర్వీస్ (PFS) ప్రారంభించింది. శిబిరాల్లో వసతి, పరిశుభ్రత, ఆహారం నాణ్యతపై ఎస్ఎంఎస్ల ద్వారా ఫీడ్‌బ్యాక్ తీసుకోవడంతో పాటు ప్రయాణికుల సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నది. అమర్నాథ్ యాత్ర కోసం తత్కాల్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించగా.. పెద్ద ఎత్తున ప్రయాణికులు బారులు తీరుతున్నారు. రైల్వేస్టేషన్‌లోని వైష్ణవిధామ్, పురాణి మండిలోని రామమందిరం, మహాజన్ సభ వద్ద తత్కాల్ రిజిస్ట్రేషన్ జరుగుతుండగా.. పెద్ద సంఖ్యలో పర్యాటకులు బారులు తీరుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

