NOTA | 2024 లోక్‌సభ ఎన్నికలు.. ‘నోటా’కు 63,72,220 ఓట్లు
NOTA | 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడ్డాయి. అయితే ఈ ఎన్నికల్లో నోటా(నన్ ఆఫ్ ది ఎబౌ)కు 63,72,220 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా బీహార్ రాష్ట్రంలో 8,97,323 ఓట్లు నోటాకు పడినట్లు పేర్కొన్నారు.
NOTA | న్యూఢిల్లీ : 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడ్డాయి. అయితే ఈ ఎన్నికల్లో నోటా(నన్ ఆఫ్ ది ఎబౌ)కు 63,72,220 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా బీహార్ రాష్ట్రంలో 8,97,323 ఓట్లు నోటాకు పడినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో 6,34,971 ఓట్లు, మధ్యప్రదేశ్‌లో 5,32,667 ఓట్లు, పశ్చిమ బెంగాల్లో 5,22,724 ఓట్లు, తమిళనాడులో 4,61,327 ఓట్లు, గుజరాత్లో 4,49,252 ఓట్లు, మహారాష్ట్రలో 4,12,815 ఓట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 3,98,777 ఓట్లు, ఒడిశాలో 3,24,588 ఓట్లు నోటాకు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్లు 65,22,772. ఈ ఎన్నికల్లో ఆ సంఖ్య రెండు లక్షలకు తగ్గింది. ఆ ఎన్నికల్లోనూ బీహార్లోనే అత్యధికంగా 8,16,950 ఓట్లు నోటాకు పోలయ్యాయి.
ఈ సార్వత్రిక ఎన్నికలలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ అత్యధిక మెజారిటీలో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన తన ప్రత్యర్థిపై 11 లక్షల 75 వేల 92 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఓట్ల మెజారిటీలోనే కాదు అత్యధిక నోటా ఓట్లు పోలైన నియోజకవర్గంగా కూడా ఇండోర్ రికార్డుల్లో నిలిచింది. ఇక్కడ నోటాకు అత్యధికంగా 2.18 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇండోర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అక్షయ్ కాంతి బామ్ చివరి నిమిషంలో నామినేషన్ విత్‌డ్రా చేసుకుని పార్టీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నోటాకు ఓటు వేయాలని ప్రజలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

