House workers | నోయిడాలో పనిమనిషిపై యజమాని దాడి.. పనులు బంద్‌జేసి నిరసనకు దిగిన ఇంటిపని వాళ్లు..|
House workers | గ్రేటర్ నోయిడా (Greater Noida) లో ఇంట్లో పనిచేసే మహిళపై యజమాని దాడికి పాల్పడ్డారు. నోయిడాలోని గౌర్ సిటీ (Gaur city) లోగల 11th అవెన్యూ అపార్టుమెంట్ కాంప్లెక్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడి ఘటన స్నబ్బిట్ (Snabbit) అనే ఇన్స్టాంట్ యాప్ ద్వారా క్షణాల్లో సిటీ అంతా పాకింది.
House workers : గ్రేటర్ నోయిడా (Greater Noida) లో ఇంట్లో పనిచేసే మహిళపై యజమాని దాడికి పాల్పడ్డారు. నోయిడాలోని గౌర్ సిటీ (Gaur city) లోగల 11th అవెన్యూ అపార్టుమెంట్ కాంప్లెక్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడి ఘటన స్నబ్బిట్ (Snabbit) అనే ఇన్స్టాంట్ యాప్ ద్వారా క్షణాల్లో సిటీ అంతా పాకింది. దాంతో సిటీలోని పనిమనుషులంతా కలిసి బాధితురాలికి న్యాయం జరిగేదాకా పనులు చేయవద్దని నిర్ణయించుకున్నారు.
దాడి ఘటనను నిరసిస్తూ.. 11th అవెన్యూ అపార్టుమెంట్ కాంప్లెక్స్ ముందు ఆందోళనకు దిగారు. పనిమనుషులు సేవలు నిలిపేయడంతో గౌర్ సిటీతోపాటు పరిసర ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారు పనిమనుషులను బుక్ చేసుకోవడం కోసం స్నబ్బిట్లో ఎంత ప్రయత్నించినా బుకింగ్ క్యాన్సిల్ అనే మెస్సేజ్ వస్తోంది. కాగా పనిమనుషుల నిరసనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
ఆందోళనకారులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. పోలీసులు నచ్చజెప్పడంతో పనిమనుషులు శాంతియుతంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ దాడి ఘటనపై ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

