Juvenile Home | జువెనైల్ హోమ్‌లో దారుణం.. పిల్లలను హింసిస్తున్న హోమ్ సూపరింటెండెంట్
Juvenile Home | అది బాల నేరస్తులు ఉండే జువెనైల్ హోమ్. అక్కడికి వచ్చే పిల్లలకు రక్షణ కల్పించడంతోపాటు, వాళ్లకు సంస్కారం నేర్పడం ఆ జువెనైల్ హోమ్ సూపరింటెండెంట్ బాధ్యత. కానీ ఆమె తీరు అందుకు భిన్నంగా ఉంది. పిల్లలపై ఆమె నిత్యం దాడులు చేస్తున్నది. వాళ్లను ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్నది. తాజాగా ఓ బాలికను జువెనైల్ హోమ్ సూపరింటెండెంట్ పూనమ్ పాల్ చెప్పుతో విచక్షణారహితంగా కొట్టింది.
ఆగ్రా: అది బాల నేరస్తులు ఉండే జువెనైల్ హోమ్. అక్కడికి వచ్చే పిల్లలకు రక్షణ కల్పించడంతోపాటు, వాళ్లకు సంస్కారం నేర్పడం ఆ జువెనైల్ హోమ్ సూపరింటెండెంట్ బాధ్యత. కానీ ఆమె తీరు అందుకు భిన్నంగా ఉంది. పిల్లలపై ఆమె నిత్యం దాడులు చేస్తున్నది. వాళ్లను ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్నది. తాజాగా ఓ బాలికను జువెనైల్ హోమ్ సూపరింటెండెంట్ పూనమ్ పాల్ చెప్పుతో విచక్షణారహితంగా కొట్టింది.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు హోమ్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది. మంగళవారం అలాంటిదే మరో వీడియో బయటపడింది. ఆ వీడియోలో హోమ్ సూపరింటెండెంట్ పూనమ్ పాల్ ఓ బాలికను కాళ్లు, చేతులు కట్టేయించి ఓ మంచం పక్కనే పడేయించింది. ఈ రెండు ఘటనలపై ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపారు. క్రూరంగా వ్యవహరిస్తున్న హోమ్ సూపరింటెండెంట్ పూనమ్ పాల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.
పూనమ్ పాల్ గతంలో ప్రయాగ్ రాజ్ జువెనైల్ హోమ్ సూపరింటెండెంట్‌గా పనిచేసినప్పుడు కూడా పిల్లలపట్ల ఇంతే క్రూరంగా వ్యవహరించారని అధికారుల విచారణలో తేలింది. కాగా, పిల్లలపట్ల క్రూరంగా వ్యవహరించినందుకు హోమ్ సూపరింటెండెంట్ పూనమ్పాల్తోపాటు ఆమెకు సహకరించిన హోమ్ సిబ్బందిని కూడా విధుల నుంచి తొలగించినట్లు ఆగ్రా డివిజన్ కమిషనర్ రీతూ మహేశ్వరి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

