Himachal Assembly polls | మంచు కొండలపై నడుస్తూ పోలింగ్ కేంద్రాలకు
Assemblypolls2022 | సాధారణంగా పార్లమెంటుకుగానీ, అసెంబ్లీలకుగానీ ఎన్నికలు జరిగినప్పుడు 70-75 శాతం పోలింగ్ నమోదైందంటే చాలా ఎక్కువ. ఎందుకంటే కొంత మంది ఓటర్ల దృష్టిలో
సిమ్లా: సాధారణంగా పార్లమెంటుకుగానీ, అసెంబ్లీలకుగానీ ఎన్నికలు జరిగినప్పుడు 70-75 శాతం పోలింగ్ నమోదైందంటే చాలా ఎక్కువ. ఎందుకంటే కొంత మంది ఓటర్ల దృష్టిలో ఎన్నికలంటే ఒక అనవసరపు ప్రహసనం. మరికొందరు ఓటర్లకు ఓటేసేందుకు బద్దకం. ఇంకొందరు ఓటర్లది ఎవరు గెలిచినా ఒరిగేదేమున్నది అనే నిర్వేదం. కానీ ఓటు విలువ తెలిసిన వారు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటారు.
ఓటు హక్కును.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాజ్యంగం తమకు ఇచ్చిన ఆయుధంగా భావిస్తారు. అలాంటి వాళ్లు ఓటు వేసేందుకు ఎంత రిస్క్ అయినా చేస్తారు. మంచు ప్రాంతాలతో కూడిన హిమాచల్‌ప్రదేశ్‌లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు చాలా కష్టపడాల్సి వస్తుంది. మంచు కొండలపై నడుస్తూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది.
చాంబా జిల్లా పంగి తహసీల్‌లోని చసాక్ భటోరి పోలింగ్స్టేషన్లో ఓటు వేసేందుకు ఓటర్లు మంచు కొండలపై నడుస్తూ వెళ్తున్న దృశ్యాన్ని పై ఫొటోలో చూడవచ్చు. వీళ్లే కాదు, హిమాచల్‌ప్రదేశ్‌లోని చాలా నియోజకవర్గాల్లో ప్రజలు ఓటేసేందుకు ఇలాంటి ప్రయాసలను ఓర్చుకోక తప్పదు. వీళ్లను చూసైనా పోలింగ్ జరుగుతుంటే ఇండ్ల నుంచి బయటకురాని బద్దకస్తుల్లో మార్పు రావాలని ఓటు విలువ తెలిసిన వారు అంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

