Double Murder: తల్లిని, ఆమె లవర్‌ను చంపిన కొడుకు.. మృతదేహాలతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు
Double Murder: తల్లిని, ఆమె లవర్‌ను చంపాడు కొడుకు. వారి మృతదేహాలతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడతను. ఈ ఘటన హర్యానాలోని సిర్సాలో జరిగింది.
సిర్సా: హర్యానాలోని సిర్సాలో దారుణమైన డబుల్ మర్డర్(Double Murder) ఘటన చోటుచేసుకున్నది. సికందర్‌పూర్‌లో 30 ఏళ్ల రాజ్‌కుమార్ అనే వ్యక్తి తన తల్లి 47 ఏళ్ల అంగూరి దేవిని, ఆమె లవర్ 48 ఏళ్ల లేఖరాజ్‌ను హత్య చేశాడు. ఇద్దర్నీ మర్డర్ చేసి వాళ్ల మృతదేహాలను ఓ ట్రక్కులో పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. ఓ ఇంట్లో ఉన్న ఇద్దర్నీ దుపట్టాతో గొంతు నులిమినట్లు తెలుస్తోంది. హత్య చేసి మృతదేహాలను ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సదర్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. తల్లిని, ఆమె లవర్‌ను చంపేశానని, తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఆ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని, వాళ్ల మృతదేహాలు తన ట్రక్కులో ఉన్నట్లు పోలీసులకు చెప్పాడతను.
రాజ్‌కుమార్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. క్రైం సీన్‌కు మరో బృందాన్ని పంపారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ పరీక్షకు తరలించారు. లేఖరాజ్తో తన కూతురికి 15 ఏళ్లుగా రిలేషన్ ఉన్నట్లు అంగూరీదేవి తల్లి సుగ్రీ పోలీసులకు చెప్పింది. అయితే తమ కుటుంబాన్ని ఆ రిలేషన్ దెబ్బతీస్తున్నట్లు భర్త, కుమారుడు వార్నింగ్ ఇచ్చినా.. అంగూరి పట్టించుకోలేదు. పలు మార్లు పంచాయితీ నిర్వహించినా ఫలితం మారలేదు. భర్త పాలా రామ్ వేడుకున్నా కూడా భార్య వినిపించుకోలేదు.
నిందితుడు రాజ్‌కుమార్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతను పోలీసు స్టేషన్‌కు వచ్చిన సమయంలో కూల్‌గా ఉన్నట్లు చెప్పారు. ఏమాత్రం పచ్చాతాపం ప్రదర్శించలేదు. తన తల్లి వల్ల కుటుంబం సిగ్గుతో తలదించుకున్నదని రాజ్‌కుమార్ పోలీసులకు చెప్పాడు. కుటుంబ మర్యాదను కాపాడుకునేందుకు ఆ చర్యకు పాల్పడినట్లు రాజ్‌కుమార్ తెలిపారు. స్థానిక గ్రామస్థులు షాక్‌లో ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

