Sanchar Saathi | కొత్త ఫోన్లలో ‘సంచార్ సాథీ’ తప్పనిసరేం కాదు : కేంద్ర టెలికామ్ విభాగం ప్రకటన
Sanchar Saathi | కొత్తగా తయారయ్యే మొబైల్ ఫోన్లలో ‘సంచార్ సాథీ (Sanchar Saathi)’ యాప్‌ను ముందుగానే ఇన్స్టాల్ చేయడం తప్పనిసరేం కాదని కేంద్ర ప్రభుత్వం (Union Govt) తెలిపింది. యాప్‌ను తప్పనిసరి చేస్తూ గతంలో జారీచేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు బుధవారం భారత టెలికామ్ విభాగం (Telecom department) ప్రకటించింది.
Sanchar Saathi : కొత్తగా తయారయ్యే మొబైల్ ఫోన్లలో ‘సంచార్ సాథీ (Sanchar Saathi)’ యాప్‌ను ముందుగానే ఇన్స్టాల్ చేయడం తప్పనిసరేం కాదని కేంద్ర ప్రభుత్వం (Union Govt) తెలిపింది. యాప్‌ను తప్పనిసరి చేస్తూ గతంలో జారీచేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు బుధవారం భారత టెలికామ్ విభాగం (Telecom department) ప్రకటించింది.
సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం కొత్తగా వచ్చే మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీచేసింది. ఇది ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే చర్య అని విపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఎవరితో సంప్రదించకుండా నియంతృత్వంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించాయి.
ప్రభుత్వ ఆదేశాల తర్వాత స్వచ్ఛందంగా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య పదింతలు పెరిగిందని, తమ లక్ష్యం కూడా ఇదేనని కేంద్రం తాజా ప్రకటనలో పేర్కొన్నది. సంచార్ సాథీ యాప్ యూజర్లు వేగంగా పెరుగుతున్నారని, తప్పనిసరి చేయడం వెనుక ఉద్దేశం కూడా ఇదేనని తెలిపింది. యాప్ తప్పనిసరి అని ఆదేశాలు ఇవ్వడం ద్వారా దీని గురించి తెలియని వాళ్లకు అవగాహన కల్పించాలి భావించామని వెల్లడించారు.
గడిచిన ఒక్కరోజులో ఆరు లక్షల మంది యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నారని, ఇది దాదాపు పదింతల పెరుగుదల అని కేంద్రం తెలిపింది. సంచార్ సాథీకి ఆదరణ పెరిగిన నేపథ్యంలో ముందస్తు ఇన్స్టలేషన్ను తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించిందని టెలికామ్ విభాగం తన ప్రకటనలో పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samsung | గెలాక్సీ ఏఐకి కొత్త ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ.. శాంసంగ్ కీలక ప్లాన్..
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
Murder | పాతబస్తీలో కార్ల వ్యాపారి దారుణ హత్య..నిందితుడి కోసం గాలింపు
Dhadkan | బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ధడ్కన్’కు సీక్వెల్.. కొత్త తారాగణంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!
TTD | వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్లు విడుదల తేదీని ప్రకటించిన టీటీడీ
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

