న్యూఢిల్లీ, డిసెంబర్ 23: కృత్రిమ మేధ రంగంలో వస్తున్న మార్పులు టెకీల పాలిట శాపంగా మారింది. వేలాది మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్ మరింత మందిని ఇంటికి పంపడానికి సిద్ధమవుతు న్నది. యాడ్ సేల్స్ యూనిట్లోని 30 వేల మందికి ఉద్వాసన పలకనుంది.
2023లో గూగుల్ 12 వేల మందిని తొలగించింది. కృత్రిమ మేధ సాంకేతికత సాయంతో కొత్త యాడ్లను సృష్టిస్తున్నది. దీని ద్వారా తక్కువ ఖర్చుతో అత్యధిక ఆదాయం వస్తుండటమే కాక, ఉద్యోగుల సేవలు అంతగా అవసరం లేకపోవడంతో ఈ విభాగంలో ఉద్యోగాల తొలగింపునకు గూగుల్ సిద్ధమవుతున్నది.