న్యూఢిల్లీ, మే 8: గూగుల్ తన డిజిటల్ వాలెట్ అప్లికేషన్ ‘గూగుల్ వ్యాలెట్’ సేవల్ని భారతదేశంలో ప్రారంభించింది. వివిధ రకాల కార్డులు, ఐడీలు, మనం ఏర్పరుచుకునే కీ లేదా ఐడీలు, లాయల్టీ కార్డులు, ట్రాన్సిట్ పాసులు.. సమస్త సమాచారాన్ని ఈ వ్యాలెట్లో భద్రపర్చుకోవచ్చునని కంపెనీ వర్గాలు తెలిపాయి.
సురక్షితమైన ప్రైవేట్ డిజిటల్ వాయలెట్గా దీనిని పేర్కొన్నాయి. ‘ప్లే స్టోర్’ నుంచి ‘గూగుల్ వ్యాలెట్’ను డౌన్లోడ్ చేసుకొని యూజర్లు సేవలు పొందొచ్చునని కంపెనీ వివరించింది.