Cheetah Deaths: కూనో పరిణామాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు: సుప్రీంకోర్టు
cheetah deaths: కూనో పార్క్‌లో చీతాలు మృతిచెందుతున్న అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చీతాల మృతిపై ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు కోర్టు తెలిపింది. త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. ఆఫ్రికా నుంచి తెచ్చిన చీతాలను ఎందుకు కేవలం కూనో పార్క్‌కు మాత్రమే పంపారని కోర్టు ప్రశ్నించింది.
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయ పార్క్‌లో ఇటీవల ఆఫ్రికా చీతా(Cheetahs)లు వరుసగా మృతిచెందుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చీతాల మరణాల సంఖ్యను మరీ తక్కువే అని కొట్టిపారేయలేమని కోర్టు తెలిపింది. జస్టిస్ బీఆర్ గవాయి, పీఎస్ నర్సింహా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఇటీవల కూనో పార్క్‌లో(Kuno Park) జరుగుతున్న పరిణామాలపై సాధారణ ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు జస్టిస్ గవాయి నేతృత్వంలోని కమిటీ పేర్కొన్నది. ఇప్పటివరకు ఆ పార్కులో 9 చీతాలు ప్రాణాలు కోల్పోయాయి.
కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదించారు. ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్టు చాలా విశిష్టమైందని, ఇప్పుడంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐశ్వర్య క్లారిటీ ఇచ్చారు. చీతాల మృతిపై మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దు అన్నారు. చీతాల మృతిని అడ్డుకోవాలని, ఇదే చాలా కీలకమైందని జస్టిస్ నర్సింహ చెప్పారు. ఈ కేసును విచారణ కోసం వాయిదా వేశారు. నమీబియా, సౌతాఫ్రికా నుంచి వచ్చిన చీతాలను ఎందుకు కేవలం కూనో పార్క్‌కు మాత్రమే పంపారని కోర్టు ప్రశ్నించింది. అవసరమైతే కొన్ని చీతాలను రాజస్థాన్‌కు పంపాలని కూడా కోర్టు సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ఓటే ఆయుధం’
MANIKANDA | అయ్యప్పపై ‘మాలికాపూరం’ దర్శకుడి కొత్త చిత్రం.. ‘మణికంఠ’ ఫస్ట్ లుక్ విడుదల
Namo Narayana | రజినీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలో కీలక పాత్ర కోసం ‘జైలర్ 2’ ఫేమ్ ‘మూర్తి’!
KTR | ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే : కేటీఆర్
NZvsIND: ఇండియా టార్గెట్ 199
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

