Brij Bhushan | బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కుమారుడి కారు బీభత్సం.. ఇద్దరు మృతి
Brij Bhushan | మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలున్న రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ కుమారుడు కాన్వాయ్‌లోని కారు ఒక బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. ఒక వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది.
లక్నో: మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలున్న రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan) కుమారుడు కాన్వాయ్‌లోని కారు ఒక బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. ఒక వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం బ్రిజ్ భూషణ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్‌లోని ఎస్యూవీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న 17 ఏళ్ల రెహాన్, 24 ఏళ్ల షాజాద్ మరణించారు. రోడ్డు వద్ద ఉన్న 60 ఏళ్ల సీతా దేవి గాయపడింది.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్‌ను అరెస్టు చేసి ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ప్రమాదం జరిగిన సమయంలో కరణ్ భూషణ్ సింగ్ ఆ కాన్వాయ్‌లో ప్రయాణించాడా లేదా అన్నది నిర్ధారణ కాలేదు. బ్రిజ్ భూషణ్ కుటుంబం నిర్వహిస్తున్న విద్యా సంస్థ పేరు మీద ఆ వాహనం రిజిస్టర్ అయ్యిందని పోలీసులు గుర్తించారు. కాగా, బ్రిజ్ భూషణ్ సింగ్‌కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్, కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

