Barack Obama | న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వలింగ సంపర్కుడా? అంటే అవుననే అంటున్నారు ఆయన జీవిత చరిత్ర రచయిత. ఆయన తొలిసారి ప్రేమలో పడ్డప్పుడు తన ప్రియురాలికి రాసిన లేఖల్లో తాను అబ్బాయిలను కూడా ప్రేమిస్తున్నట్టు చెప్పుకొన్నారు.
‘ప్రాపంచిక జీవిత ప్రహసనం, వర్తమాన కాలం నుంచి తప్పించుకోవడానికి స్వలింగ సంపర్కం ప్రయత్నించాలని నేను నమ్ముతున్నాను. నీకు తెలుసా.. నేను రోజూ నా ఊహల్లో పురుషులతో ప్రేమలో పడుతుంటాను’ అని అలెక్స్‌కు రాసిన ఓ ప్రేమలేఖలో తెలిపారు.