తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన గోవా మాజీ ముఖ్యమంత్రి
Goa Ex-CM: గోవా మాజీ ముఖ్యమంత్రి లూజిన్హో ఫలేరో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ కీలక నాయకుడు అభిషేక్ బెనర్జి సమక్షంలో ఫలేరో టీఎంసీ తీర్థం

కోల్‌కతా: గోవా మాజీ ముఖ్యమంత్రి లూజిన్హో ఫలేరో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ కీలక నాయకుడు అభిషేక్ బెనర్జి సమక్షంలో ఫలేరో టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు గోవా నుంచి బెంగాల్‌కు వచ్చిన ఫలేరో ముందుగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జితో భేటీ అయ్యారు. కాగా, గత 40 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఫలేరో.. ఈ నెల 27న ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇది గోవా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు.
2017లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో విజయం సాధించింది. అధికార బీజేపీ 13 స్థానాలకు పరిమితమైంది. అయినా ఇండిపెండెంట్లు, ఇతర చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ తర్వాత బలమైన ఓటు బ్యాంకే ఉన్న టీఎంసీ వచ్చే గోవా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో గోవా కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన ఫలేరో టీఎంసీలో చేరడం ఆ పార్టీకి బూస్ట్‌ను ఇస్తుందనే చెప్పవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- EX-CM
- Goa
- Luizinho Faleiro
- TMC
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

