Jalebi | జీవితంలో తొలిసారి జిలేబీ తిన్న ఫారెన్ అమ్మాయి.. వైరల్ అవుతున్న ఆమె రియాక్షన్!
Jalebi | భారత్‌లో ఎన్నో రకాల స్వీట్స్ ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్కటి ఫేమస్. కానీ కొన్ని మాత్రం దేశవ్యాప్తంగా బాగా ఫేమస్. అలాంటి స్వీట్స్‌లో ఒకటి జిలేబీ. తియ్యని పాకంలో నానబెట్టిన జిలేబీ తింటుంటే ఆ ఆనందమే వేరు.
భారత్‌లో ఎన్నో రకాల స్వీట్స్ ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్కటి ఫేమస్. కానీ కొన్ని మాత్రం దేశవ్యాప్తంగా బాగా ఫేమస్. అలాంటి స్వీట్స్‌లో ఒకటి జిలేబీ. తియ్యని పాకంలో నానబెట్టిన జిలేబీ తింటుంటే ఆ ఆనందమే వేరు. మరి అలాంటి జిలేబీని తొలిసారిగా తినే విదేశీయులు ఎలా ఫీలవుతారు? దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
హనుమాన్ గౌడ అనే భారతీయుడు కొలంబియాకు చెందిన కాలెన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె తన జీవితంలో తొలిసారి జిలేబీ తినడాన్ని కెమెరాలో బంధించాడు. ‘కనీసం ట్రై చేస్తోంది కదా.. తనను క్యాన్సిల్ చెయ్యకండి’ అని క్యాప్షన్‌తో హనుమాన్ ఈ వీడియోను షేర్ చేశాడు. వీడియో ఆరంభంలో అందమైన చీరకట్టు, బొట్టుతో కనిపించిన కాలెన్.. భర్త చెప్పడంతో జిలేబీ తీసుకుంది.
కొంచెం తిన్న ఆమె.. ‘ఇదేంటి ఇంత జిగురుగా (స్లైమీగా) ఉంది?’ అని అడిగింది. బలవంతం మీద మరో చిన్న ముక్క కొరికి ‘హనీ.. ఇక వద్దు’ అంటూ చేతిలోని జిలేబీని పక్కన ఉన్న వాళ్లకు ఇచ్చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఆమెకు జిలేబీ నచ్చకపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. మరొకరేమో ‘భారతీయ వంటకాలు తినేటప్పుడు ఏమీ ఆలోచించకూడదు. వాటి రుచిని ఆస్వాదించాలంతే’ అని కామెంట్ చేశారు. మీరు కూడా కాలెన్ రియాక్షన్‌పై ఒకసారి లుక్కేయండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

