విదేశీ జాతీయులు కూడా కరోనా టీకాకు అర్హులే: కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో ఉంటున్న విదేశీ జాతీయులు ఇకపై కరోనా వ్యాక్సిన్ పొందవచ్చు. కరోనా టీకాకు వారు కూడా అర్హులేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. దేశంలోని మిగతా లబ్ధిదారుల మాదిరిగా విదేశీయులు కూడా కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకుని వ్యాక్సిన్ వేయించుకోవచ్చని తెలిపింది. గుర్తింపు ధ్రువీకరణగా వారి పాస్‌పోర్ట్‌ను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. ‘కోవిడ్ -19 నుండి భద్రతను నిర్ధారించే చొరవలో ఇది ఒక మైలురాయి. భారతదేశంలో నివసిస్తున్న విదేశీ పౌరులు కోవిడ్ -19 టీకా తీసుకోవడానికి కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి అనుమతిస్తూ కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నది. విదేశీయులు కోవిన్ పోర్టల్‌లో నమోదు కోసం వారి పాస్‌పోర్ట్‌ను గుర్తింపు పత్రంగా ఉపయోగించవచ్చు. కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న తర్వాత వారు టీకా కోసం స్లాట్ పొందుతారు’ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కార్యాలయం కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ‘మనం కలిసి పోరాడదాం, కరోనాపై కలిసి గెలుద్దాం. దీని కోసం చేతులు కలుపుదాం. ఇప్పుడు భారత్‌లో నివసిస్తున్న విదేశీ పౌరులు కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి, కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. ఇది వైరస్ వ్యాప్తి నుంచి భద్రతను నిర్ధారిస్తుంది’ అని ట్వీట్ చేసింది. మరోవైపు దేశంలో ఈ ఏడాది జనవరి నుంచి కరోనా టీకా కార్యక్రమం ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 50 కోట్లకుపైగా జనాభా వ్యాక్సిన్ పొందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

