Doctors Dismissed | విధులకు గైర్హాజరు.. 17 మంది డాక్టర్ల తొలగింపు
Doctors Dismissed | ఎలాంటి సమాచారం ఇవ్వకుడా విధులకు గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకున్నారు. 17 మంది ప్రభుత్వ వైద్యులను డిస్మిస్ చేశారు. నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యానికి తావు లేదని వార్నింగ్ ఇచ్చారు.
లక్నో: ఎలాంటి సమాచారం ఇవ్వకుడా విధులకు గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకున్నారు. 17 మంది ప్రభుత్వ వైద్యులను డిస్మిస్ చేశారు. (Doctors Dismissed) నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యానికి తావు లేదని వార్నింగ్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన 17 మంది ప్రభుత్వ వైద్యులను ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ గురువారం తొలగించారు. ఎక్స్ పోస్ట్‌లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ‘ప్రజలకు సేవ చేయడంతోపాటు ఆరోగ్య సేవలు అందించే బాధ్యత పొందడం గొప్ప అదృష్టం. రోగులకు సేవ చేయడం భగవంతుడికి సేవ చేసినట్లే. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యానికి, క్రమశిక్షణా రాహిత్యానికి తావు లేదు’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 17 మంది వైద్యాధికారులు సామాన్య ప్రజలకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ ఆరోపించారు. వారు చాలా కాలంగా విధులకు దూరంగా ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ వైద్యులను విధుల నుంచి తొలగిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశానని అన్నారు. అయితే డిస్మిస్ చేసిన ప్రభుత్వ డాక్టర్ల పేర్లను ఆయన వెల్లడించలేదు.
जनमानस की सेवा का दायित्व मिलना व स्वास्थ्य सेवा प्रदान करना सौभाग्य है, मरीजों की सेवा ईश्वर की सेवा है, इसमें किसी भी प्रकार की लापरवाही, अनुशासनहीनता का कोई स्थान नहीं है।
चिकित्सकीय सेवाओं को आम नागरिकों को प्रदान किये जाने में लापरवाही बरतने तथा ड्यूटी से लंबे समय तक बिना…
— Brajesh Pathak (@brajeshpathakup) July 11, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

