Kangana Ranaut | కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ బెంగళూరుకు బదిలీ..!
Kangana Ranaut | చండీగఢ్‌లోని షాహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్‌పై అధికారులు బదిలీ వేటు వేశారు. కుల్విందర్ కౌర్‌ను చండీగఢ్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Kangana Ranaut | చండీగఢ్‌లోని షాహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్‌పై అధికారులు బదిలీ వేటు వేశారు. కుల్విందర్ కౌర్‌ను చండీగఢ్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే, కుల్విందర్ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. ఆమెపై శాఖాపరమైన విచారణ కొనసాగుతున్నది. జూన్ 7న చండీగఢ్‌లోని షాహీద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కుల్విందర్ అనే మహిళా కానిస్టేబుల్ కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ ఫిర్యాదుతో కుల్విందర్ సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయగా.. సిట్ దర్యాప్తును పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించింది. ఈ ఘటన జూన్ 7న జరిగింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ ఎంపీ ఢిల్లీ వెళ్లేందుకు చండీగఢ్ విమానాశ్రయానికి వచ్చారు. చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్ సమయంలో డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ బాలీవుడ్ నటిపై చేయి చేసుకున్నారు. రైతుల ఉద్యమంపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రైతుల ఉద్యమాన్ని కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఆ సమయంలో సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పలువురు కుల్విందర్‌కు మద్దతు తెలిపారు. ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడంతో మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ సహా పలువురు ఉద్యోగం ఇస్తామంటూ ఆఫర్లు ఇచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

