శృంగారం కోసం పదే పదే కోరుతున్న వృద్ధ భర్త… విసిగిపోయి హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసిన భార్య
ఆ వృద్ధ దంపతుల వయసు తెలుసుకున్న ‘అభయం’ సిబ్బంది తొలుత ఆశ్చర్యపోయారు. ఆ వృద్ధురాలు తన బాధను వెళ్లగక్కడంతో సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
అహ్మదాబాద్: వృద్ధుడైన భర్త పదే పదే శృంగారాన్ని కోరడంతో అతడి భార్య విసిగిపోయింది. చివరకు మహిళా హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసింది. గుజరత్లోని వడోదరలో ఈ సంఘటన జరిగింది. ఇంజినీర్‌గా రిటైరైన 89 ఏళ్ల వ్యక్తి, 87 ఏళ్ల భార్య చాలా అన్యోన్యంగా జీవిస్తున్నారు. కుమారుడు, కోడలితో కలిసి సయాజిగంజ్ ప్రాంతంలో నివాసంలో ఉంటున్నారు. అయితే వృద్ధుడైన ఆ భర్త ఆ వయసులో కూడా మాటిమాటికి శృంగారాన్ని కోరుతున్నాడు. వయసు పరంగా అనారోగ్యం, శరీరం సహకరించకపోవడంతో అతడి భార్య విసుగుపోయింది. నిరాకరించినందుకు తనపై అరవడం, చిర్రుబుర్రులాడంతో చివరకు మహిళా హెల్ప్‌లైన్ ‘అభయం’కు ఆమె ఫోన్ చేసింది.
కాగా, ఆ వృద్ధ దంపతుల వయసు తెలుసుకున్న ‘అభయం’ సిబ్బంది తొలుత ఆశ్చర్యపోయారు. ఆ వృద్ధురాలు తన బాధను వెళ్లగక్కడంతో సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. వారి ఇంటికి వెళ్లి ఆమె భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ కోరికలను నియంత్రించుకునేందుకు యోగా చేయడంతోపాటు ఆలయాలు సందర్శించాలని సూచించారు. అలాగే మనసు ఆహ్లాదం కోసం సీనియర్ సిటిజన్స్ గార్డెన్లు, పార్కులకు వెళ్లాలని హితబోధ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

