Zombie deer disease | ప్రపంచం ముంగిట మరో ముప్పు.. వేగంగా వ్యాపిస్తున్న జాంబీ డీర్ డిసీజ్
Zombie deer disease | ఉపద్రవంలా వచ్చిపడి ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి దాదాపు మాయమైన వేళ కొత్త భయాలు పుట్టుకొస్తున్నాయి.
- మానవులకూ సోకే ప్రమాదం
- కెనడా శాస్త్రవేత్తల హెచ్చరిక
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఉపద్రవంలా వచ్చిపడి ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి దాదాపు మాయమైన వేళ కొత్త భయాలు పుట్టుకొస్తున్నాయి. ‘జాంబీ డీర్ డిసీజ్’ వేగంగా విస్తరిస్తున్నదని, ఇది త్వరలోనే మానవులకూ అంటుకోవడం ఖాయమంటూ కెనడా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీని అసలు పేరు ‘క్రోనిక్ వేస్టింగ్ డిసీజ్’.
ఈ ఇన్ఫెక్షన్ సోకిన జంతువు ఏదైనా మెదడువాపు లాంటి తీవ్రమైన సమస్యలతో చనిపోతుంది. ఇప్పుడీ ఇన్ఫెక్షన్ అమెరికాలోని జింకల్లో శరవేగంగా విస్తరిస్తున్నది. జనవరి చివరి వారంలో రెండు కేసులు వెలుగు చూడడంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ చర్యలు ప్రారంభించింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జింకలు, దుప్పి, కణుజు, క్యారిబో (ఒక రకమైన జింక) వంటివి వాటికి పరీక్షలు చేయాలని అధికారులు ఆదేశించారు.
ప్రొటీన్లు సరైన ఆకారం సంతరించుకోకపోవడమే (ప్రియాన్స్) జాంబీ డీర్ డిసీజ్‌కు కారణం. ఇది సోకిన తర్వాత ప్రియాన్స్ కేంద్ర నాడీ వ్యవస్థ గుండా ప్రయాణించి మెదడు కణజాలం, అవయవాల్లోకి చొరబడుతుంది. ఈ డిసీజ్ సోకిన జింకలు చొంగకార్చుకోవడం, నడుస్తుండగా అదుపు తప్పడం, ఉదాసీనంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ కారణంగా ఈ డిసీజ్‌కు జాంబీ డీర్ డిసీజ్ అని పేరు వచ్చింది. ప్రస్తుతం ఇది జంతువుల్లోనే వెలుగుచూసినప్పటికీ మానవులకు సోకినట్టు ఎక్కడా నిర్ధారణ కాలేదు. కాకపోతే వేగంగా విస్తరిస్తుండడంతో మానవులకూ సోకే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

