Farmers Protest | రైతుల ఆందోళనపై నిఘా వర్గాల హెచ్చరిక..! పోలీసుల హై అలెర్ట్..!
Farmers Protest | రైతుల ఆందోళన నేపథ్యంలో నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీతో పాటు ఐదు రాష్ట్రాల పోలీసుల రైతుల ఆందోళనపై దృష్టి సారించారు. దేశ రాజధాని వైపు రాకుండా అడ్డుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 10న నాలుగు గంటల పాటు రైల్‌రోకో నిర్వహించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
Farmers Protest | రైతుల ఆందోళన నేపథ్యంలో నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీతో పాటు ఐదు రాష్ట్రాల పోలీసుల రైతుల ఆందోళనపై దృష్టి సారించారు. దేశ రాజధాని వైపు రాకుండా అడ్డుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 10న నాలుగు గంటల పాటు రైల్‌రోకో నిర్వహించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నెల 14న రాంలీలా మైదాన్‌లో కిసాన్ మహా పంచాయత్ జరపాలని నిర్ణయించాయి. అయితే, మొన్నటి వరకు ట్రాక్టర్లతో ఆందోళన చేపట్టిన రైతులు ప్రస్తుతం అందుకు భిన్నంగా ఢిల్లీకి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో రైలు, మెట్రోతో ఇతర రోడ్డు రవాణా మార్గాలు సైతం పోలీసు నిఘా రాడార్లోనే ఉన్నాయి. హర్యానా, పంజాబ్, యూపీ, రాజస్థాన్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
హర్యానా, పంజాబ్‌కు చెందిన వేలాది మంది రైతులు శంభు, ఖానౌరీ సరిహద్దులకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి సైతం రైతులు ఢిల్లీకి చేరుకుంటారని భావిస్తున్నారు. కేవలం బస్సులు, రైలు, మెట్రో ద్వారా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్దకు చేరుకోవాలని రైతులు భావిస్తున్నారు. కార్లు, జీపులు, చిన్న బస్సులు తదితర వ్యక్తిగత రవాణాను వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పోలీసులకు రైతులను అడ్డుకోవడం సవాల్‌గా మారనున్నది. జంతర్ మంతర్ వద్దకు రాకుండా అడ్డుకుంటున్నట్లుగా పోలీసులు చెప్పనప్పటికీ 144 సెక్షన్ విధించారు. నిరసనకు ఎవరినీ అనుమతించడం లేదు. అయితే, ఢిల్లీలోకి రైతులు ప్రవేశించాక అల్లకల్లోం సృష్టించే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. ప్రధాని, హోంశాఖమంత్రితో పాటు పలువురు వీవీఐపీల ఇండ్ల ఎదుట నిరసన తెలిపే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం.
అయితే, రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలోని అనేక మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమై ఢిల్లీకి రాకుండా నిఘా వేశారు. రైల్వే, మెట్రో, ప్రజా రవాణా బస్సుల్లో తనిఖీలు పెంచారు. ప్రైవేట్ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలని అధికార వర్గాలు ఆదేశించినట్లు తెలస్తున్నది. రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసు, కేంద్ర బలగాలను అప్రమత్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీని ఆనుకొని ఉన్న సరిహద్దుల్లో ప్రత్యేకంగా నిఘా వేశారు. రైతులు బస చేసేందుకు వీలున్న ప్రదేశాల్లోనూ పోలీసులను మోహరించారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీలోని పలుచోట్ల 144 సెక్షన్ విధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

