Formers protest | ఢిల్లీ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తం.. రైతులను మరోసారి చర్చలకు పిలిచిన కేంద్రం
Formers protest | దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ‘ఢిల్లీ చలో’ ఆందోళనలో భాగంగా శంభు సరిహద్దు వద్దకు భారీగా రైతులు చేరుకున్నారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే రైతులు ఇంకా భారీగా తరలివస్తుండటంతో వారిపై భాష్పవాయు గోళాలు ప్రయోగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
Formers protest: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ‘ఢిల్లీ చలో’ ఆందోళనలో భాగంగా శంభు సరిహద్దు వద్దకు భారీగా రైతులు చేరుకున్నారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే రైతులు ఇంకా భారీగా తరలివస్తుండటంతో వారిపై భాష్పవాయు గోళాలు ప్రయోగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆ మేరకు భాష్పవాయు గోళాలను సిద్ధంగా ఉంచుకున్నారు.
ఈ క్రమంలో కేంద్ర సర్కారు రైతులను మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఒక ప్రకటన చేశారు. రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మరోసారి చర్చలకు రావాల్సిందిగా రైతులను ఆహ్వానిస్తున్నామని, కనీస మద్దతు ధర, పంట మార్పిడి, వ్యర్థాల దహనంపై రైతులతో చర్చకు సిద్ధమని ఆయన చెప్పారు.
అదేవిధంగా గత ఆందోళనల సందర్భంగా రైతులపై నమోదైన ఎఫ్ఐఆర్ ఎత్తివేతపై చర్చిస్తామని అర్జున్ ముండా తెలిపారు. దేశంలో శాంతి నెలకొనాలంటే చర్చలు చాలా ముఖ్యమని అన్నారు. కాగా, తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని రైతులు అంటున్నారు. పంటలకు కనీస మద్దతు ధరపై పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’.. బహిష్కరణ తర్వాత అనంత్ సింగ్
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్ .. దక్షి, శాలిని ఔట్, రెమ్యునరేషన్ వివరాలు వైరల్!
DK Shivakumar | కన్నడ యువతకు ఉద్యోగాలివ్వకపోతే చర్యలు కఠినంగుంటాయ్ : డీకే శివకుమార్
Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
Rakesh Reddy | నిరుద్యోగ, విద్యారంగ సమస్యలపై పోరాడిన చరిత్ర రాకేష్ రెడ్డిది.. ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

