Nilesh N Rane | క్రియాశీల రాజకీయాలకు నారాయణ రాణే తనయుడు గుడ్ బై..!
Nilesh N Rane | క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు మాజీ లోక్ సభ సభ్యుడు, బీజేపీ నేత నీలేశ్ రాణే ప్రకటించారు.
Nilesh N Rane |మాజీ లోక్‌సభ సభ్యుడు, బీజేపీ నేత నీలేశ్ రాణే యాక్టివ్ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు మంగళవారం ప్రకటించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి నారాయణ రాణే తనయుడే నీలేష్ రాణే. `యాక్టీవ్ పాలిటిక్స్ నుంచి దూరం కావడానికి ఎటువంటి కారణం లేదు. నేను ఇంత కంటే ఎక్కువగా పాలించలేను` అని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’లో పోస్ట్ చేశారు.
2019-20లో ప్రజల నుంచి తనకు ప్రేమాభిమానాలు దక్కాయని, అందుకు వారికి చాలా వరకూ రుణ పడి ఉంటానని పేర్కొన్నారు నీలేశ్ రాణె. ప్రజల ప్రేమాభిమానాలను పొందడానికి బీజేపీ వంటి పార్టీలో పని చేసే అవకాశం లభించిందని పోస్ట్ చేశారు.
‘నేను రాజకీయాల్లో చాలా నేర్చుకున్నా. కొందరు సహచరులు జీవితకాలం నా కుటుంబ సభ్యులుగా నిలిచిపోయారు. నా జీవితంలో వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటా’ అని తన పోస్ట్ లో రాసుకొచ్చారు. ‘ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాకు ఆసక్తి లేదు’ అని కూడా పేర్కొన్నారు.
‘విమర్శలు ఎల్లవేళలా విమర్శలే. అటువంటి వాటితో నా టైం గానీ, ఇతరుల టైం గానీ వేస్ట్ కానివ్వదల్చుకోలేదు. నా మనస్సుకు నచ్చని పనులు చేయాలని భావించడం లేదు’ అని తెలిపారు. తన వల్ల జరిగిన పొరపాట్లతో ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని కోరారు. నీలేశ్ రాణె సోదరుడు నీతేష్ రాణె ప్రస్తుతం మహారాష్ట్రలోని కంకావళి స్థానం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నీలేశ్ రాణె ఇంతకుముందు 15వ లోక్ సభకు కాంగ్రెస్ పార్టీ తరఫున రత్నగిరి-సింధుర్గ్ నుంచి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో శివసేన అభ్యర్థి వినాయక్ రౌత్ చేతిలో ఓటమి పాలైన తర్వాత బీజేపీలో చేరారు నీలేశ్ రాణె.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

