Supreme Court | నిందుతుల ఫోటోలు, వీడియోలు తీసిన వెంటనే అప్లోడ్.. సోషల్ మీడియా ధోరణిపై సుప్రీంకోర్టు ఆందోళన
Supreme Court | నిందితుల ఫొటోలు, వీడియోలు తీసిన వెంటనే సోషల్ మీడియా (Social Media) లో అప్లోడ్ చేస్తుండటాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తప్పుపట్టింది. మొబైల్ ఫోన్ (Mobile Phone) ఉన్న ప్రతి ఒక్కరూ ఒక మీడియాలా తయారయ్యారని వ్యాఖ్యానించింది. ఇలాంటి సోషల్ మీడియా ధోరణి పారదర్శక విచారణకు ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేసింది.
Supreme Court : నిందితుల ఫొటోలు, వీడియోలు తీసిన వెంటనే సోషల్ మీడియా (Social Media) లో అప్లోడ్ చేస్తుండటాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తప్పుపట్టింది. మొబైల్ ఫోన్ (Mobile Phone) ఉన్న ప్రతి ఒక్కరూ ఒక మీడియాలా తయారయ్యారని వ్యాఖ్యానించింది. ఇలాంటి సోషల్ మీడియా ధోరణి పారదర్శక విచారణకు ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. అరెస్టయిన నిందితుల వీడియోలు, ఫొటోలను పోలీసులు అధికారిక సోషల్ మీడియాలో ఖాతాలలో ఎలా అప్లోడ్ చేస్తారని ప్రశ్నిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాలా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శనివారం విచారణ జరిపింది.
అరెస్ట్ చేసిన నిందితుల ఫొటోలు, వీడియోలను పోలీసులు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ప్రజల ఆలోచనలను ప్రభావితం చేస్తుందని, ఆ నిందితులు నిర్దోషులుగా విడుదలైతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పిల్ దాఖలైంది. ఒక కేసు విషయంలో పోలీసుల మీడియా బ్రీఫింగ్‌పై మార్గదర్శకాలు రూపొందించాలని అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించిందని, అందులో సోషల్ మీడియాను కూడా చేర్చాలని పిల్ వేసిన పిటిషనర్ కోరారు. ఈ పిల్‌పై జరిగిన విచారణలో భాగంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
సంకెళ్లు వేసిన, తాళ్లతో బంధించిన, మోకాళ్లపై కూర్చోబెట్టిన నిందితుల ఫొటోలను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేయడం సదరు వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించడమే అవుతుందని, అది ప్రజల ఆలోచనను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నది. అయితే నిబంధనల ద్వారా పోలీసులను నియంత్రించడానికి వీలు ఉంటుందని, కానీ సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ కలిగిన వ్యక్తుల సంగతేంటని, వారిని నియంత్రించగలమా..? అని సుప్రీం ధర్మాసనం ఆందోళన వెలిబుచ్చింది. ఈ అంశంపై విస్తృత పరిశీలన అవసరం అని అభిప్రాయపడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

