న్యూఢిల్లీ : ఒంట్లో ఓపిక ఉండాలే గానీ వయసు కేవలం ఓ అంకె మాత్రమేని వారు నిరూపించారు. ఐకానిక్ సాంగ్ బడే మియా చోటే మియాకు ఇద్దరు పెద్దాయనలు ఎపిక్ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో దుమ్మురేపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను షేర్ చేయగా ఇద్దరు వ్యక్తుల పెర్ఫామెన్స్‌ను నెటిజన్లు కొనియాడారు.
సంగీత్ విత్ సల్వి అనే పేజ్ ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. అమితాబ్, గోవిందాపై చిత్రీకరించిన ఈ హిట్ ట్రాక్‌కు ఓ పెండ్లి వేడుకలో ఇద్దరు వ్యక్తులు క్రేజీ స్టెప్స్‌తో అలరించడం ఈ క్లిప్‌లో కనిపిస్తుంది.
వీరిద్దరూ బ్లాక్ సూట్స్ ధరించి కిల్లర్ మూమెంట్స్‌తో అతిధులను అలరించారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి పది లక్షల మందికి పైగా వీక్షించారు. బడేమియా చోటే మియా సాంగ్‌ను ఉదిత్ నారాయణ్, సుదేష్ భోస్లే ఆలపించారు.