న్యూఢిల్లీ: ఎబోలా వైరస్‌కు మూడు నెలల్లో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది! యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహా తన భాగస్వామ్య సంస్థలతో కలిసి దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నది. ప్రస్తుతం ఆఫ్రికాలో వేగంగా వ్యాపిస్తున్న బండిబుగ్యో ఎబోలా వైరస్ స్ట్రెయిన్‌ను లక్ష్యంగా చేసుకొని శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
ముందస్తు క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే క్లినికల్ గ్రేడ్ టీకా డోసులు రెండు-మూడు నెలల్లో సిద్ధమయ్యే అవకాశం ఉన్నది. కొవిడ్ టీకాకు ఉపయోగించిన సాంకేతికతనే ఎబోలా వైరస్ టీకాలోనూ ఉపయోగించనున్నారు.