Cyclone alert | ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న సిత్రాంగ్.. మెఘాలయా, మిజోరంలో రెడ్ అలర్ట్
Cyclone alert | సిత్రాంగ్ తుఫాన్ కారణంగా ఈశాన్య రాష్ట్రాలు వణుకుతున్నాయి. గత రెండు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. వరదల కారణంగా నాలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Cyclone alert | ఈశాన్య రాష్ట్రాలను సిత్రాంగ్ తుఫాన్ వణికిస్తున్నది. ఆసోం, పశ్చిమ బెంగాల్ సహా మేఘాలయ, మిజోరంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. సిత్రాంగ్ కారణంగా నాలుగు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. సోమవారం బంగ్లాదేశ్‌లో విధ్వంసం సృష్టించిన తుఫాన్.. అక్కడ దాదాపు 11 మందిని బలిగొన్నది.
బంగ్లాదేశ్ తీర ప్రాంతాన్ని తాకిన అనంతరం సిత్రాంగ్ తుఫాను భారతదేశాన్ని తాకింది. అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపురలో వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. మరోవైపు త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ మీదుగా గంటకు 100-110 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా, అసోంలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గౌహతిలో మంగళవారం కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల యోగక్షేమాలపై దృష్టిపెట్టాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. 24 పరగణాల జిల్లాలోని బక్హాలీ బీచ్‌లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే మోహరించారు.
ఇలాఉండగా. బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్ తుఫాన్ వాయుగుండం అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున బంగ్లాదేశ్ తీరం వద్ద తినాకోనా ద్వీపం, బరిసాల్ సమీపంలోని శాండ్విచ్ మధ్య దాటింది. సోమవారం రాత్రి 11.30 గంటలకు తుఫాను కేంద్రం ఢాకాకు తూర్పున 40 కి.మీ దూరంలో కోస్తా బంగ్లాదేశ్‌పై ఉన్నది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు 7 రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

