Mamata Banerjee | మమతా బెనర్జీ నివాసంలోకి గన్తో చొరబడేందుకు వ్యక్తి యత్నం.. పోలీసులు అరెస్ట్
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) నివాసంలోకి ఒక వ్యక్తి గన్తో చొరబడేందుకు ప్రయత్నించాడు. అలెర్ట్ అయిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి వద్ద తుపాకీ, కత్తితోపాటు కొన్ని ఏజెన్సీలకు చెందిన ఐడీ కార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) నివాసంలోకి ఒక వ్యక్తి గన్తో చొరబడేందుకు ప్రయత్నించాడు. అలెర్ట్ అయిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి వద్ద తుపాకీ, కత్తితోపాటు కొన్ని ఏజెన్సీలకు చెందిన ఐడీ కార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. నల్లకోటు, టై ధరించిన ఒక వ్యక్తి పోలీస్ అని స్టిక్కర్ ఉన్న కారులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాళీఘాట్ నివాసం వద్దకు చేరుకున్నాడు. గన్, కత్తి కలిగిన అతడు భద్రతా లేన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. నిలువరించిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
కాగా, ఆ వ్యక్తిని షేక్ నూర్ ఆలంగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఉన్న అతడి నుంచి గన్, కత్తి, మత్తు పదార్థాలతోపాటు కొన్ని భద్రతా ఏజెన్సీలకు చెందిన ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నారని కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ తెలిపారు. ఈ సంఘటన జరిగినప్పుడు సీఎం మమతా బెనర్జీ ఆ నివాసంలో ఉన్నట్లు చెప్పారు.
మరోవైపు, పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కోల్కతాలో శుక్రవారం ‘అమరవీరుల దినోత్సవం’ ర్యాలీ నిర్వహించనున్నది. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ నివాసం వద్దకు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఆమె తన నివాసం నుంచి బయలుదేరాల్సి ఉంది. ఇంతలో గన్, కత్తి కలిగిన వ్యక్తి భద్రతా లేన్లోకి ప్రవేశించడం కలకలం రేపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన చేనేత కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వాలి’
Health tips | కాలేయం పనితీరును మెరుగుపర్చే ఈ ఆహారపదార్థాల గురించి మీకు తెలుసా..?
Delhi Police: జర్నలిస్టుల బెనిఫిట్స్.. రీల్మేకర్స్కు వర్తించవు: సుప్రీంలో ఢిల్లీ పోలీసులు
చుక్కలబోడులో పెన్షన్ పత్రాలు అందజేత
KTR | కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీ ప్రభుత్వం జలదోపిడీ చేస్తుంది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

