తాగుబోతు చేసిన పనికి ఆగిపోయిన విమానం..!
చెన్నై: ఓ తాగుబోతు చేసిన తుంటరి పని దుబాయ్ వెళ్లాల్సిన విమానాన్ని ఆగిపోయేలా చేసింది. ఎయిర్‌పోర్టు సిబ్బంది, పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టేలా చేసింది. ఇంతకూ అతను చేసిన పని ఏందంటే.. ఆ తాగుబోతు కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు శనివారం ఉదయం దుబాయ్ వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. అయితే వాళ్లు ఈ రోజు దుబాయ్‌కి వెళ్లడం తాగుబోతుకు ఇష్టం లేదు.
కానీ, వాళ్లు అతని మాటను పట్టించుకోకుండా ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. దాంతో వాళ్లను ఎలాగైనా దుబాయ్ వెళ్లకుండా ఆపాలని తాగుబోతు ప్లాన్ చేశాడు. ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బందికి ఫోన్ చేసి సదరు విమానంలో బాంబు ఉందని చెప్పాడు. దాంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టి బాంబు కోసం గాలించారు. అలాంటిదేమీ లేదని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ఆలస్యంగా విమానం దుబాయ్‌కి బయలుదేరింది.
ఇక ఫోన్ కాల్ ఎవరి నుంచి వచ్చిందా అని ట్రేస్ చేయగా నిందితుడు దొరికిపోయాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. తమ కుటుంబసభ్యులను దుబాయ్ వెళ్లకుండా ఆపేందుకే ఆ పని చేశానని చల్లగా చెప్పాడు. దాంతో ముక్కున వేలేసుకోవడం పోలీసుల వంతయ్యింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

