Pinaka Roket | పినాక రాకెట్‌ను బుధవారం డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. దేశ రక్షణలో కొత్త ఆయుధాల తయారీలో నిమగ్నమైన డీఆర్డీవో పినాక రాకెట్ పరిధిని పెంచింది. ఈ మేరకు రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో రాకెట్‌ను విజయవంతంగా శాస్త్రవేత్తలు పరీక్షించారు.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో ) అధికారి మాట్లాడుతూ ఈ రాకెట్‌ను అభివృద్ధి చేశామని, అయితే ఉత్పత్తిని ప్రైవేట్ రంగ సంస్థ చేస్తోందని చెప్పారు. రాకెట్ల ప్రయోగాలు పోఖ్రాన్లో కొనసాగుతున్నాయి. అనేక రాకెట్ల ట్రయల్స్ నిర్వహించగా విజయవంతమయ్యాయి. పినాక ఆర్టిలరీ మిస్సైల్ సిస్టమ్.. ఇది శత్రు భూభాగంలోకి 75 కిలోమీటర్ల వరకు దూసుకువెళ్లి ఖచ్చితత్వంతో దాడి చేస్తుంది.
#WATCH | Trials of the Pinaka extended range rocket are going on in the Pokharan firing ranges in Rajasthan & multiple successful test firings have been carried out during these tests. Developed by DRDO, the rockets are produced by private sector firm: DRDO officials pic.twitter.com/VPZ5S9HIwj
— ANI (@ANI) August 24, 2022