పెంపుడు కుక్క కోసం.. బిజినెస్ క్లాస్ క్యాబిన్ మొత్తం బుక్ చేసిన యజమాని

ముంబై: పెంపుడు కుక్క కోసం దాని యజమాని ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ క్యాబిన్ మొత్తాన్ని బుక్ చేశాడు. దీంతో ఆ బొచ్చు కుక్క ఎంతో దర్జాగా, లగ్జరీగా బుధవారం ఉదయం విమానంలో ముంబై నుంచి చెన్నైకి ప్రయాణించింది. ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌లో గతంలో కూడా పెంపుడు కుక్కలు ప్రయాణించాయి. అయితే ఒక పెంపుడు కుక్క కోసం బిజినెస్ క్లాస్ మొత్తాన్ని బుక్ చేయడం ఇదే తొలిసారి.
సాధారణంగా ఎయిర్ ఇండియా ఏ320 విమానంలోని జే క్లాస్‌లో 12 సీట్లు ఉంటాయి. ముంబై నుంచి చెన్నైకి బిజినెస్ క్లాస్ సీటు ఛార్జీ సుమారు రూ.20,000. ఈ లెక్కన పెంపుడు కుక్క రెండు గంటల ప్రయాణం కోసం మొత్తం బిజినెస్ క్లాస్ బుక్ చేసిన ఆ యజమాని రూ.2.5 లక్షలకుపైగా ఖర్చు చేశాడు.
కాగా, దేశంలో పెంపుడు జంతువులను అనుమతించే ఏకైక విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మాత్రమే. గరిష్ఠంగా రెండు పెంపుడు జంతువులను మాత్రమే అనుమతిస్తారు. సంబంధిత క్లాస్‌లోని చివరి వరుస సీటులో వాటిని కూర్చొనిస్తారు.
మరోవైపు గత ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఎయిర్ ఇండియా డొమస్టిక్ విమానాల్లో రెండు వేల పెంపుడు జంతువులు ప్రయాణించినట్లు ఆ సంస్థ పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

