Doctor Shoots Nurse | మరో వ్యక్తితో సంబంధంపై డాక్టర్ ఆగ్రహం.. నర్సుపై కాల్పులు
Doctor Shoots Nurse | మరో వ్యక్తితో సంబంధంపై ఆగ్రహించిన డాక్టర్ ఒక నర్సుపై గన్‌తో కాల్పులు జరిపాడు. (Doctor Shoots Nurse) గాయపడిన ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాల్పులు జరిపిన డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
భోపాల్: మరో వ్యక్తితో సంబంధంపై ఆగ్రహించిన డాక్టర్ ఒక నర్సుపై గన్‌తో కాల్పులు జరిపాడు. (Doctor Shoots Nurse) గాయపడిన ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాల్పులు జరిపిన డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఈ సంఘటన జరిగింది. 34 ఏళ్ల డాక్టర్ సందీప్ సోనీకి ఆసుపత్రిలో పనిచేసే 27 ఏళ్ల నర్సుతో రిలేషన్ ఉంది. అయితే ఆ నర్సు తన పాత స్నేహితుడితో చనువుగా ఉంటున్నది. డాక్టర్ సందీప్‌కు ఈ విషయం తెలిసి ఆమెను అనుమానించాడు. ఈ నేపథ్యంలో బుధవారం దీని గురించి నర్సును నిలదీశాడు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన డాక్టర్ సందీప్ తన వద్ద ఉన్న దేశీయ రివాల్వర్‌తో నర్సుపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.
కాగా, ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పుల్లో గాయపడిన నర్సును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ సందీప్‌ను అరెస్ట్ చేశారు. హత్యాయత్నం, ఆయుధ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

