న్యూఢిల్లీ: రద్దీగా ఉండే రహదారిపై ప్రార్థనలు చేస్తున్న ఓ గుంపును చెదరగొట్టటంలో ఢిల్లీ పోలీస్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. నమాజ్ చేస్తున్న వారిని కాలితో తన్నాడు. ఈ దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో అతడిని ఉ న్నతాధికారులు సస్పెండ్ చేశారు.
ఢిల్లీలోని ఇందర్‌లోక్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇందర్‌లోక్ పోలీస్ పోస్ట్‌కు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న అధికారి ఒకరు పక్కనే ఉన్న మసీదు దగ్గర ప్రార్థనలు చేస్తున్నవారిని చెదరగొట్టే వీడియో క్లిప్పింగ్ ఒకటి వెలుగు చూసింది.