Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
Delhi Metro Stations: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అక్టోబర్ 10వ తేదీన భారీ నిరసన ప్రదర్శన చేపట్టేందుకు కాక్రోచ్ జనతా పార్టీ సిద్దమైన విషయం తెలిసిదే. 57 మెట్రో స్టేషన్లకు చెందిన ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ను పోలీసులు రిక్వెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అక్టోబర్ 10వ తేదీన భారీ నిరసన ప్రదర్శన చేపట్టేందుకు కాక్రోచ్ జనతా పార్టీ సిద్దమైన విషయం తెలిసిదే. సర్ ప్రక్రియలో జరిగిన ఓట్ల చోరీ అంశం దృష్ట్యా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కోరుతూ సీజేపీ డిమాండ్ చేస్తున్నది. అయితే శనివారం జరగననున్న నిరసన ప్రదర్శన నేపథ్యంలో.. ఢిల్లీ పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఢిల్లీలోని 57 మెట్రో స్టేషన్ల(Delhi Metro Stations)కు చెందిన ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ను రిక్వెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి 9 నుంచి , అక్టోబర్ 10వ తేదీన పరిస్థితి మెరుగుపడే వరకు మెట్రో స్టేషన్లను మూసివేయనున్నారు.
రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియేట్, పటేల్ చౌక్, జన్‌పథ్, న్యూఢిల్లీ, మండీ హౌజ్, ఐటీవో, సుప్రీంకోర్టు, ఇంద్రప్రస్థ, కశ్మీర్ గేట్, కరోల్ బాగ్, ఐఎన్ఏ, హౌజ్ ఖాస్, లజ్‌పత్ నగర్, జామియా మిలియా ఇస్లామియా, సీలాంపుర్, వెల్కమ్, షాదార, రితాల, రోహిణి ఈస్ట్, రోహిణి వెస్ట్ స్టేషన్లు ఉన్నాయి. సంబంధిత అధికారులు, సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని డీఎంఆర్సీని పోలీసులు కోరారు. మరో వైపు తమ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని సీజేపీ నేత అభిజీత్ దీప్కే తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

