కాలా జథేడి గ్యాంగ్ : మోస్టు వాటెండ్ లేడీ డాన్ అనురాధ చౌదరి అరెస్టు
కాలా జథేడి గ్యాంగ్ | రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మోస్టు వాటెండ్ లేడీ డాన్ అనురాధ చౌదరిని ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేకం బృందం ఇవాళ అరెస్టు చేసింది.

న్యూఢిల్లీ : రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మోస్టు వాటెండ్ లేడీ డాన్ అనురాధ చౌదరిని ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేకం బృందం ఇవాళ అరెస్టు చేసింది. కాలా జథేడి గ్యాంగ్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన అనురాధ చౌదరి పలు దోపిడీలు, కిడ్నాప్‌లు, హత్యలు, అపహరణలకు పాల్పడి కొన్నాళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నది. ఈమెతోపాటు మోస్టు వాంటెండ్ గ్యాంగ్‌స్టర్ కాలా జథేడి అలియాస్ సందీప్‌ను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై 6 లక్షల రివార్డు ఉంది. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఇతడు హత్యలు, కిడ్నాప్‌లు, అపహరణలు, దోపిడీలు, హత్యాయత్నాలతో బయోత్పాతం సృష్టించాడు. వీరిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా.. ఇద్దరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఇద్దరు మోస్టు వాంటెండ్ క్రిమినల్స్‌ను ఉత్తర ప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమినర్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

