మహిళపైనా ‘గ్యాంగ్ రేప్’ కేసు పెట్టొచ్చు
ఒక మహిళ స్వయంగా లైంగిక చర్యకు పాల్పడకపోయినా బాధితురాలిపై జరిగిన అత్యాచారానికి సహకరించినప్పుడు క్రిమినల్ చట్టం ప్రకారం ఆమెపై సామూహిక లైంగిక దాడి కేసును నమోదు చేయవచ్చని ఢిల్లీ హైకోర్టు గురువారం ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. గతంలో సామూహిక లైంగిక దాడికి సహకరించిన మహిళలు తీవ్రమైన ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి వీలు కల్పించిన చట్టంలోని లొసుగును ఈ తీర్పు పరిష్కరించింది.
- ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు
న్యూఢిల్లీ: ఒక మహిళ స్వయంగా లైంగిక చర్యకు పాల్పడకపోయినా బాధితురాలిపై జరిగిన అత్యాచారానికి సహకరించినప్పుడు క్రిమినల్ చట్టం ప్రకారం ఆమెపై సామూహిక లైంగిక దాడి కేసును నమోదు చేయవచ్చని ఢిల్లీ హైకోర్టు గురువారం ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. గతంలో సామూహిక లైంగిక దాడికి సహకరించిన మహిళలు తీవ్రమైన ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి వీలు కల్పించిన చట్టంలోని లొసుగును ఈ తీర్పు పరిష్కరించింది. ఒక మహిళ తన మైనర్ కుమార్తెను మరో నిందితుడితో లైంగిక సంబంధం కలిగి ఉండేలా బలవంతం చేసిందనే ఆరోపణలకు సంబంధించిన కేసులో ఈ తీర్పు వెలువడింది. ఈ నేరంలో భాగస్వామిగా ఉన్న తల్లిపై అభియోగాలు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేస్టూ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఒక మహిళపై ఐపీసీ సెక్షన్ 376డీ, బీఎన్ఎస్ సెక్షన్ 70 కింద సామూహిక లైంగిక దాడి నేరాన్ని మోపలేమని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదని ఈ కోర్టు భావిస్తున్నది. ప్రస్తుత తీర్పులో లేవనెత్తిన ప్రశ్నకు ఇదే సమాధానం అని హైకోర్టు పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

