Delhi Airport | ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాలు.. టాప్ టెన్‌లో ఢిల్లీ ఎయిర్పోర్ట్
Delhi Airport | దేశరాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే టాప్ 10 విమానాశ్రయాల్లో (Top 10 Busiest Airports In World) చోటు దక్కించుకుంది.
Delhi Airport | దేశరాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే టాప్ 10 విమానాశ్రయాల్లో (Top 10 Busiest Airports In World) చోటు దక్కించుకుంది. 2023లో ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే టాప్ టెన్ ఎయిర్ పోర్ట్స్ జాబితాను ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) తాజాగా విడుదల చేసింది.
ఈ జాబితాలో అమెరికాలో గల అట్లాంటా ఎయిర్ పోర్ట్ తొలి స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత దుబాయ్, డల్లాస్/ పోర్ట్ వర్త్, లండన్, యుకే, టోక్యో, జపాన్, డెన్వార్ అమెరికా, ఇస్తాంబుల్- టర్కీ, లాస్ ఏంజెల్స్, చికాగో వరసగా ఉన్నాయి. రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్స్ జాబితాలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ (Delhi Airport) పదో స్థానంలో నిలవడం విశేషం.
ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వెల్లడించిన నివేదిక ప్రకారం.. 2023లో ఢిల్లీ ఎయిర్ పోర్టులో 7 కోట్లా 22 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 2022లో మాత్రం రద్దీగా ఉండే జాబితో తొమ్మిదో స్థానంలో నిలవడం విశేషం. 2019లో మాత్రం 17వ స్థానంలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఉంది. ఈ విమానాశ్రయం భారతదేశ రాజధానికి ప్రధాన అంతర్జాతీయ గేట్వేగా పనిచేస్తోందని ఏసీఐ పేర్కొంది.
విమానాశ్రయాల్లో విదేశాల నుంచి ఎక్కువ మంది వచ్చిన వారి జాబితా ఆధారంగా ర్యాంకింగ్ ఇచ్చారు. ఇక తొలి స్థానంలో నిలిచిన అట్లాంటా ఎయిర్ పోర్ట్ నుంచి దాదాపుగా 104.6 మిలియన్ల మంది ప్రయాణికులు ట్రావెల్ చేసినట్లు నివేదికలో వెల్లడైంది. ఆ తర్వాత దుబాయ్ ఎయిర్ పోర్ట్ నుంచి 86.99 మిలియన్స్ మంది ప్రయాణించారని పేర్కొంది. మూడో స్థానంలో నిలిచిన డల్లాస్/ పోర్ట్ వర్త్ విమానాశ్రయం నుంచి దాదాపుగా 81.75 మిలియన్స్ మంది , లండన్‌లోని హిత్రూ విమానాశ్రయం నుంచి 79.18 మిలియన్స్, టోక్యో ఎయిర్పోర్ట్ నుంచి 78.7 మిలియన్స్ మంది తమ గమ్యస్థానాలకు ప్రయాణించారు.
ప్రపంచంలోనే టాప్ టెన్ అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఐదు ఎయిర్‌పోర్ట్స్ అమెరికాలోనే ఉండటం విశేషం. 2023లో అంతర్జాతీయంగా ప్రయాణించిన మొత్తం ప్రయాణికుల సంఖ్య దాదాపుగా 850 కోట్లుగా ఉన్నట్లు ఏసీఐ పేర్కొంది. 2022తో పోలిస్తే ఇది 27.2 శాతం వృద్ధి కనిపిస్తోందని తెలిపింది.
Also Read..
Srinagar | జీలం నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి
Aishwarya Rajinikanth | ధనుష్ – ఐశ్వర్య జంటకు చెన్నై ఫ్యామిలీ కోర్టు నోటీసులు
Odisha | ఫ్లైఓవర్ పైనుంచి పడిన బస్సు.. ఐదుగురు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
KBR Park | ఎక్కడి స్తంభాలు అక్కడే.. పనులు ఆగిన కేబీఆర్ పార్క్ వద్ద అధ్వాన స్థితి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలినిని కావాలనే ఎలిమినేట్ చేశారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

