బీఆర్వో నేతృత్వంలోని 63 ప్రాజెక్టులు ఆవిష్కరించిన రాజ్‌నాథ్

లేహ్ : లడాఖ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. ఇవాళ లేహ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్వో) నిర్మించిన 63 ఇన్ఫ్రా ప్రాజెక్టులను వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు. దేశాభివృద్ధిలో కనెక్టివిటీ చాలా కీలకమైందన్నారు. దేశంలో వివిధ ప్రాంతాలను కలపడంలో బీఆర్వో ముఖ్య పాత్ర పోషించిందని రాజ్‌నాథ్ అన్నారు.
లడాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు ఉగ్రవాదం ఓ కారణమన్నారు. సామాజిక ఆర్థిక అభివృద్ధి కూడా ఈ ప్రాంతంలో లేదన్నారు. లడాఖ్‌ను యూటీగా ప్రకటించిన తర్వాత ఉగ్రవాద ఘటనలు తగ్గినట్లు ఆయన చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు, మౌళిక సదుపాయాలను వృద్ధిపరిచేందుకు కేంద్రం అనేక చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. జమ్మూకశ్మీర్‌తో పాటు లడాఖ్‌ను రాజకీయ ప్రక్రియ మళ్లీ షురూ కావాలన్నది ప్రధాని మోదీ ఉద్దేశం అన్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర రాజకీయా పార్టీలతో ఆయన చర్చించినట్లు తెలిపారు. లడాఖ్ ప్రజలతోనూ ప్రధాని చర్చించనున్నట్లు రాజ్‌నాథ్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

