Booster Dose | ‘కోవోవాక్స్’పై రేపు నిపుణుల కమిటీ సమావేశం..!
Covovax | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా ముప్పు నేపథ్యంలో దేశంలోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అందరు బూస్టర్ డోస్ వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో బూస్టర్ డోస్‌గా
Covovax Vaccine | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా ముప్పు నేపథ్యంలో దేశంలోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అందరు బూస్టర్ డోస్ వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో బూస్టర్ డోస్‌గా మరో టీకా అందుబాటులోకి రానున్నది. కోవోవాక్స్‌ను బూస్టర్ డోస్‌గా పరిగణించే విషయంపై బుధవారం నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకోనున్నది. నిపుణుల కమిటీ ఆమోదం తెలిపితే.. వ్యాక్సిన్‌ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావాలని సిరమ్ కంపెనీ భావిస్తుంది.
కొవిషీల్డ్, కోవాగ్జిన్ రెండు డోసుల టీకా తీసుకున్న వారికి కోవోవాక్స్ టీకాను బూస్టర్ డోస్‌గా ఇవ్వొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై చర్చించేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సమావేశం బుధవారం జరుగనున్నది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)లో ప్రభుత్వ నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ ఇటీవల డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)కి లేఖరాశారు. పెద్దలకు బూస్టర్ డోస్‌గా టీకాను ఆమోదించాలని కోరారు.
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో వైరస్ విస్తరిస్తుందన్న నేపథ్యంలో నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా కోవోవాక్స్ టీకాను డిసెంబర్ 28, 2021న పెద్దల కోసం డీసీజీఐ అత్యవసర వినియోగం కింద అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత 12-17, 7-11, సంవత్సరాల పిల్లలకు సైతం వ్యాక్సిన్ వేసేందుకు అనుమతులు జారీ చేసింది. అమెరికా ఫార్మా దిగ్గజం నోవోవాక్స్ తయారు చేసిన టీకాను సీరమ్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్నది. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ టీకాను ఆమోదించగా.. 2021 డిసెంబర్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ జాబితాలో వ్యాక్సిన్‌ను చేర్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

