న్యూఢిల్లీ : షారుక్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ వసూళ్ల సునామీ కొనసాగుతోంది. ఐదు రోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. పఠాన్ మూవీలోని బేషరం రంగ్ సాంగ్‌కు పెండ్లి వేడుకలో వరుడు స్నేహితుల డ్యాన్స్ ఫెర్పామెన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
View this post on Instagram
A post shared by Twisters Wedding Choreography (@twistersweddingchoreography)
పెండ్లికొడుకు అంగద్ చదా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశాడు. ఈ షార్ట్క్లిప్లో అంగద్ ఫ్రెండ్స్ బేషరం రంగ్ సాంగ్‌కు ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో డ్యాన్స్ ఫ్లోర్‌పైకి కిల్లర్ ఎంట్రీ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు అనుగుణంగా క్రేజీ మూమెంట్స్‌తో హోరెత్తించారు.
దీపికా పదుకునే వేసిన హుక్ స్టెప్‌ను కూడా వరుడి ఫ్రెండ్స్ ట్రై చేయడం కనిపిస్తుంది. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి పది లక్షల మందికి పైగా వీక్షించారు. పూర్తి డ్యాన్స్ ఫెర్పామెన్స్ను చూడాలనుకుంటున్నానని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఇలాంటి స్నేహితులు నాకెందుకు లేరని మరో యూజర్ రాసుకొచ్చారు.