అయోధ్యలో దళిత అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్‌రేప్
- ఎఫ్ఐఆర్ నమోదుచేసేందుకు నిరాకరించిన పోలీసులు
- ఉన్నతాధికారుల జోక్యంతో చివరకు నమోదు
అయోధ్య, ఆగస్టు 11: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో బాలికలు, మహిళలు, దళితులకు రక్షణ లేకుండాపోయింది. అయోధ్య జిల్లాలో దళిత వర్గానికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లను బంధించి ముగ్గురు దుండగులు లైంగికదాడికి పాల్పడ్డారు.
బాధితుల్లో ఒక బాలిక మైనర్. ఈ ఘటన బికాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వారి గ్రామానికి సమీపంలోని షెర్పూర్పురా మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో దుండగులు వారిని అపహరించి దగ్గరలోని చెరుకు పొలాల్లోకి తీసుకెళ్లి సామూహికంగా లైంగిక దాడి జరిపారు. అనంతరం వారిని విడిచి పెట్టారు. ఇంటికి వెళ్లిన బాధితులు విషయాన్ని మరుసటి రోజు కుటుంబసభ్యులకు తెలిపారు.
నిరాకరించిన పోలీసులు
లైంగిక దాడి జరిగిందని బాధితురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు స్థానిక పోలీసులు నిరాకరించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. అయితే సీనియర్ పోలీసు అధికారుల జోక్యంతో చివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భాయిలాల్ యాదవ్, త్రిభువన్ యాదవ్, మరో గుర్తు తెలియని వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Ayodhya
- FIR
- Gang-raped woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe | వాతావరణ మార్పులతోనే యూరప్‌లో ఎండలు.. 50వేల మరణాలకు అవే కారణం..
‘సీతారామ ప్రాజెక్టుతో సింగరేణి మండలానికి ఒరిగిందేమీ లేదు’
Hansika | హన్సిక పేరుతో ప్రైవేట్ వీడియో కలకలం.. డీప్‌ఫేక్ ప్రచారంపై అసలు నిజం ఇదే!
MLA Kalvakuntla Sanjay | అక్కడ పెద్దన్న, ఇక్కడ చిన్నన్న.. తెలంగాణను నిలువునా ముంచుతున్నారు : ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
నెల్లిబండలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

